శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Jul 25, 2020 , 03:07:06

మీ ఎంబసీని మూసేయండి!

మీ ఎంబసీని మూసేయండి!

  • అమెరికాపై చైనా ప్రతిచర్యలు

బీజింగ్‌: అమెరికా, చైనా మధ్య సంబంధాలు మరింత బలహీనమవుతున్నాయి. హ్యూస్టన్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేయాలన్న అమెరికా ఆదేశాలపై చైనా ప్రతీకార చర్యలు చేపట్టింది. సిచుయాన్‌ లోని చెంగ్డూలో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయాన్ని మూసివేయాలని ఆ దేశానికి ఆదేశాలిచ్చింది. హ్యూస్టన్‌లోని తమ ఎంబసీని మూసివేయాలని చెబుతూ అంతర్జాతీయ సంబంధాల్లోని ప్రాథమిక నిబంధనల్ని ఏకపక్షంగా తుంగలో తొక్కిన అమెరికా నిర్ణయాలకు ప్రతిస్పందనగానే  ఈ చర్య చేపట్టినట్టు చైనా వెల్లడించింది.


logo