సోమవారం 26 అక్టోబర్ 2020
International - Jul 06, 2020 , 00:50:25

చైనాలో బుబోనిక్‌ ప్లేగ్‌!

చైనాలో బుబోనిక్‌ ప్లేగ్‌!

బీజింగ్‌: యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలో తాజాగా బుబోనిక్‌ ప్లేగు కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. అక్కడి బయన్నూర్‌లోని దవాఖానలో శనివారం ఓ కేసు నమోదైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో అధికారులు లెవల్‌-3 హెచ్చరికలు జారీచేశారు. ఈ ఏడాది చివరి వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అసాధారణ లక్షణాలు కనిపిస్తే వైద్యులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


logo