బుధవారం 08 జూలై 2020
International - Jun 20, 2020 , 01:31:21

కరోనా సంక్షోభాన్ని చైనా వాడుకుంటున్నది

కరోనా సంక్షోభాన్ని చైనా వాడుకుంటున్నది

వాషింగ్టన్‌, జూన్‌ 19: ప్రపంచం మొత్తం కరోనా సంక్షోభంతో సతమతమవుతుంటే, ఈ పరిస్థితిని చైనా అవకాశంగా మలుచుకుంటున్నదని అమెరికా దౌత్యవేత్త డేవిడ్‌ స్టిల్‌వెల్‌ ఆరోపించారు. భారత్‌తో సరిహద్దు గొడవ కూడా అందులో భాగమేనని పేర్కొన్నారు. స్టిల్‌వెల్‌ అమెరికా విదేశాంగశాఖలో తూర్పు ఆసియా పసిఫిక్‌ విభాగం అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ‘ప్రపంచమంతా కరోనాను ఎదుర్కోవటంలో తలమునకలుగా ఉండి ఇతర విషయాలపై పరధ్యానంగా ఉన్నది. దీనిని చైనా అవకాశంగా తీసుకొని సరిహద్దుల్లో వివాదాలు సృష్టిస్తున్నది. గతంలో కూడా చైనా ఇలాంటి చర్యలకే పాల్పడింది’ అని స్టిల్‌వెల్‌ అన్నారు.


logo