శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 08, 2020 , 10:37:45

చైనా వ్యాక్సిన్‌.. వృద్ధుల‌కు బెట‌ర్‌

చైనా వ్యాక్సిన్‌.. వృద్ధుల‌కు బెట‌ర్‌

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం చైనాకు చెందిన సినోవాక్ బ‌యోటెక్ కంపెనీ వ్యాక్సిన్ త‌యారు చేస్తున్న‌ది.  అయితే ఆ సంస్థ త‌యారు చేసిన వ్యాక్సిన్‌.. వృద్ధుల‌కు బాగా ప‌నిచేస్తున్న‌ట్లు తేలింది. ఈ విష‌యాన్ని ఆ సంస్థే వెల్ల‌డించింది. టీకా తీసుకున్న‌‌వారిలో వృద్ధులు బెట‌ర్‌గా ఫీల‌వుతున్న‌ట్లు సినోవాక్ కంపెనీ వెల్ల‌డించింది.  వివిధ ద‌శ ట్ర‌య‌ల్స్ ఆధారంగా ప్రాథ‌మిక ఫ‌లితాల విశ్లేష‌ణ చేశారు. సినోవాక్ టీకా వ‌ల్ల యువ‌త‌లో ఇమ్యూనిటీ రెస్పాన్స్ తక్కువ‌గా ఉన్న‌ట్లు కంపెనీ పేర్కొన్న‌ది. క‌రోనా వాక్ పేరుతో సినోవాక్ టీకాను రూపొందిస్తున్న‌ది. అయితే తొలి, రెండ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్‌లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవ‌ని గుర్తించారు. 

క‌నీసం 60 ఏళ్ల వ‌య‌సు ఉన్న 421 మందిపై వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ జ‌రిగాయి. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 8 వ్యాక్సిన్లు మూడ‌వ ద‌శ‌లో ఉన్నాయి. దాంట్లో నాలుగు టీకాలు చైనాకు చెందిన‌వే. బ్రెజిల్‌, ఇండోనేషియా దేశాల్లో క‌రోనా వాక్ టీకా తుది ద‌శ మాన‌వ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి. వాస్త‌వానికి ఈ వ్యాక్సిన్‌ను ఇప్ప‌టికే వేల మందికి ఇచ్చారు.  సినోవాక్ ఉద్యోగులే 90 శాతం మంది ఉన్నట్లు ఆ సంస్థ ప్ర‌తినిధి లీయూ పీచెంగ్ తెలిపారు. మూడేళ్ల పాటు టీకాను స్టోరేజ్ చేయ‌వ‌చ్చు అని చెప్పారు.   logo