గురువారం 28 మే 2020
International - Apr 13, 2020 , 19:57:42

మ‌ళ్లీ న‌వంబ‌ర్‌లో వైర‌స్ తారాస్థాయికి..

మ‌ళ్లీ న‌వంబ‌ర్‌లో వైర‌స్ తారాస్థాయికి..

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ ఇప్ప‌టికే ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేసింది.  వుహాన్‌లో మొద‌లైన మర‌ణ‌మృదంగం .. ఇప్పుడు అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. చైనాలో గ‌త ఏడాది డిసెంబ‌ర్ నుంచి కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆ త‌ర్వాత ఇరాన్, ఇట‌లీ, స్పెయిన్, అమెరికా లాంటి దేశాల్లో ఎక్కువ సంఖ్యలో కోవిడ్‌19 కేసులు నమోదు అయ్యాయి.  ఇంకా అనేక దేశాల్లో క‌రోనా మ‌ర‌ణాలు పెరుగుతున్నా.. ఇదంతా కేవ‌లం తొలి ద‌శ మాత్ర‌మే. అయితే ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో రెండ‌వ సారి వైర‌స్ మ‌ళ్లీ విజృంభిస్తుంద‌ని చైనాకు చెందిన నిపుణుడు జాంగ్ వెన్‌హాంగ్ తెలిపారు. మ‌ళ్లీ న‌వంబ‌ర్‌లో వైర‌స్ తారాస్థాయికి వెళ్లే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న అంచ‌నా వేశారు. కానీ మొద‌టి ద‌శ క‌న్నా.. రెండ‌వ ద‌శ‌లో వైర‌స్ సంక్ర‌మ‌ణ‌ తీవ్ర‌త త‌క్కువ‌గా ఉంటుంద‌న్నారు.  అతి స్వ‌ల్పరీతిలో వైద్య స‌దుపాయాలు ఉన్న ఆఫ్రికా, ద‌క్షిణ అమెరికా లాంటి ఖండాల్లో రాబోయే శీతాకాలంలో వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చే ప్ర‌మాదం ఉంద‌న్నారు.logo