గురువారం 22 అక్టోబర్ 2020
International - Sep 26, 2020 , 20:41:45

జంతువులలో చైనా కొవిడ్‌ టీకా సానుకూల ఫలితాలు!

జంతువులలో చైనా కొవిడ్‌ టీకా సానుకూల ఫలితాలు!

బీజింగ్‌: కొవిడ్‌ వ్యాప్తికి కేంద్ర బిందువైన చైనా ఆ మహమ్మారిని ఎదుర్కొనే టీకాకోసం గట్టిగానే కృషిచేస్తోంది. ఇప్పటికే ఎన్నో టీకాలు క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయి. కాగా, తాజాగా ఆ దేశానికి చెందిన క్లోవర్ బయోఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక కరోనావైరస్ వ్యాక్సిన్ సురక్షితమైనదిగా, జంతు పరీక్షలలో రోగనిరోధక ప్రతిస్పందనలను ప్రేరేపించగలదని తేలిందని పరిశోధకులు తెలిపారు. 

కోతులపై జరిపిన ట్రయల్స్‌లో క్లోవర్‌ టీకా సానుకూల ఫలితాలు ఇచ్చింది. ఈ టీకా తయారీకి  బ్రిటన్‌కు చెందిన గ్లాక్సో స్మిత్‌క్లైన్, యూఎస్‌కు చెందిన డైనవాక్స్‌ టెక్నాలజీస్‌ సహాయం తీసుకుంటున్నది. ఈ కంపెనీ డ్రగ్స్‌ను వాడుతోంది.  కాగా, కోతులపై జరిపిన క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమైనట్లు క్లోవర్‌ కంపెనీ పేర్కొంది. కొవిడ్‌ నుంచి కోలుకున్న రోగులకంటే టీకా తీసుకున్న కోతుల్లో వ్యాధితో పోరాడే యాంటీబాడీస్‌ ఎక్కువ సంఖ్యలో అభివృద్ధి చెందాయని తెలిపింది. ఇది రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ అని పేర్కొంది. అలాగే, కోతుల్లో బరువు తగ్గడం, జ్వరం, అవయవాల నష్టంలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని స్పష్టంచేసింది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo