మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 08, 2020 , 17:27:42

అమెరికాను చైనా పాలించాలనుకుంటోంది : డొనాల్డ్ ట్రంప్

అమెరికాను చైనా పాలించాలనుకుంటోంది : డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్ : అమెరికాలో రానున్న నవంబర్‌ నెలలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థుల వాక్చాతుర్యం తీవ్రమైంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్‌పై దుమ్మెత్తి పోశారు. తనను ఓడించడం ద్వారా అమెరికాను చైనా పాలించాలని అనుకుంటోంది అని తీవ్రంగా ఆరోపించారు. 

తాను రెండవసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలువకూడదని చైనా కోరుకుంటున్నదని, ఇది చైనాతోపాటు ఇరాన్‌కు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ట్రంప్ అన్నారు. నిద్రావస్థలో ఉన్న జో బిడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉండాలని చైనా కోరుకుంటున్నది. ఎందుకంటే, ఆయనను అడ్డుపెట్టుకుని అమెరికాను చైనా పాలించాలనుకుంటున్నది అని తీవ్రమైన ఆరోపణ చేశారు. న్యూజెర్సీలో ఆయన మీడియాతో సంభాషించారు. జో బిడెన్ చేతిలో నేను ఓడిపోవాలని చైనా కోరుకుంటున్నదని, బీజింగ్ మన దేశాన్ని కొనాలనుకుంటుందని చెప్పారు. జో బిడెన్ అధ్యక్షుడైతే చైనాకు మన దేశాన్ని పాలించడం చాలా ఈజీ అని, ఇందుకోసం చైనా కలలు కంటున్నదని తెలిపారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా, రష్యా జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఎన్నికల్లో చైనా ముప్పు అని మీరు అనుకుంటే ఇందులో తప్పేమీ లేదని, అయితే, నేను వారికి చెప్పదలచుకున్నది ఏమిటంటే, మేము వారి కదలికలను గమనిస్తున్నామని అని ట్రంప్ చెప్పారు. మెయిల్-ఇన్ ఓటింగ్ లో ప్రమాదం ఎక్కువ అని, రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా కూడా వాటి ద్వారా కుట్ర చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అందుకే జో బిడెన్ ను అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత అమెరికా ప్రజలపై ఉన్నదన్నారు.


logo