శనివారం 30 మే 2020
International - May 18, 2020 , 20:01:30

కోవిడ్‌19.. చైనా రెండు బిలియ‌న్ డాల‌ర్ల సాయం

కోవిడ్‌19.. చైనా రెండు బిలియ‌న్ డాల‌ర్ల సాయం

హైద‌రాబాద్‌: ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ 73వ వార్షిక సమావేశాల సంద‌ర్భంగా చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ మాట్లాడారు. వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌సంగించారు. కోవిడ్‌19 మ‌హ‌మ్మారి వ‌ల్ల ఆర్థికంగా న‌ష్ట‌పోయిన దేశాల‌కు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల‌కు రెండు బిలియ‌న్ డాల‌ర్ల సాయం చేయ‌నున్న‌ట్లు జిన్‌పింగ్ తెలిపారు. రెండేళ్ల వ‌ర‌కు ఆ డ‌బ్బును ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా స‌మావేశాలను ఆన్‌లైన్ ద్వారా నిర్వ‌హిస్తున్నారు.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోవిడ్‌19 వ‌ల్ల మృతిచెందిన వారికి నివాళి అర్పించారు. మృతుల‌ కుటుంబాల‌కు ఆయ‌న సంతాపం తెలిపారు.  క‌ఠిన‌త‌ర‌మైన ప్ర‌య‌త్నాలు, త్యాగాల త‌ర్వాత‌నే చైనాలో వైర‌స్‌ను అదుపు చేయగలిగామ‌న్నారు. ఆ ప్ర‌య‌త్నాల వ‌ల్ల త‌మ ప్ర‌జ‌ల‌ను, వారి ఆరోగ్యాల‌ను కాపాడుకోగ‌లిగామ‌న్నారు. వ్యాక్సిన్ త‌యారీ అయిన త‌ర్వాత దాన్ని అంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చే విధంగా చూస్తామ‌న్నారు.

కోవిడ్‌19 విష‌యంలో త‌మ దేశం చాలా ఓపెన్‌గా, పార‌ద‌ర్శ‌కంగా, బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించింద‌ని జిన్‌పింగ్ అన్నారు. వైర‌స్ నియంత్ర‌ణ‌కు సంబంధించిన అంశాల‌ను, చికిత్సా ప‌ద్ద‌తుల‌ను ప్ర‌పంచ దేశాల‌తో నిర్మోహ‌మాటంగా పంచుకున్న‌ట్లు తెలిపారు. త‌మ శ‌క్తికి త‌గిన‌ట్లు ప్ర‌భావిత దేశాల‌కు స‌హాయ‌ప‌డిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  కోవిడ్‌19 నియంత్ర‌ణ‌కు చైనా అధ్య‌క్షుడు ఆరు ప్ర‌తిపాద‌న‌లు చేశారు.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌స్ సంక్ర‌మ‌ణ‌న‌ను నియంత్రించాల‌న్నారు. వీలైనంత త్వ‌ర‌గా స‌రిహ‌ద్దులు దాట‌కుండా చూడాల‌న్నారు. 

వైర‌స్ క‌ట్ట‌డిలో డ‌బ్ల్యూహెచ్‌వోకు మ‌ద్ద‌తు తెలిపారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ముందుండాల‌న్నారు. ఈ ద‌శ‌లో డ‌బ్ల్యూహెచ్‌వోకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌న్నారు. అలా చేస్తే అది అంత‌ర్జాతీయ స‌హ‌కారం అవుతుంద‌న్నారు. ప్ర‌జ‌ల జీవితాల‌ను కాపాడ‌గ‌లిగివార‌వుతార‌న్నారు.  

అభివృద్ధి చెందుతున్న ఆఫ్రికా దేశాల‌కు ప్ర‌పంచ దేశాలు అండ‌గా నిల‌వాల‌న్నారు. త‌మ దేశం 50 ఆఫ్రికా దేశాల‌కు సాయం చేసింద‌న్నారు. ప్ర‌జా ఆరోగ్య వ్య‌వ‌స్థ‌లో గ్లోబ‌ల్ గ‌వ‌ర్నెన్స్‌ను స‌మ‌ర్థ‌వంతంగా త‌యారు చేయాల‌న్నారు.  డ‌బ్ల్యూహెచ్‌వో నేతృత్వంలో చాలా ప్రొఫెష‌న‌ల్‌గా ఈ ప‌ని సాగాల‌న్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక‌, సామాజిక స్థిర‌త్వంగా సాధించాల‌న్నారు. వైర‌స్‌ను ఓడించ‌డంలో అంత‌ర్జాతీయ స‌హ‌కారం బ‌ల‌మైన ఆయుధంగా ప‌నిచేస్తుంద‌న్నారు.  రెండు బిలియ‌న్ డాల‌ర్ల స‌హాయ నిధితో పాటు ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసేందుకు ఐక్య‌రాజ్య‌స‌మితితో క‌లిసి ప‌నిచేస్తామ‌న్నారు.  logo