బుధవారం 03 జూన్ 2020
International - Apr 03, 2020 , 13:37:03

కోవిడ్ మృతుల‌కు నివాళి అర్పించ‌నున్న చైనా

కోవిడ్ మృతుల‌కు నివాళి అర్పించ‌నున్న చైనా


హైద‌రాబాద్‌: కోవిడ్‌19 వ్యాధి వ‌ల్ల మృతిచెందిన వారికి చైనా.. శ‌నివారం నివాళి అర్పించ‌నున్న‌ది. రేపు జాతీయ సంస్మ‌ర‌ణ దినంగా పాటించ‌నున్న‌ది. ఈ సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా .. జాతీయ‌జెండాల‌ను అవ‌న‌తం చేయ‌నున్నారు. విదేశాల్లో ఉన్న చైనా ఎంసీలు, కౌన్సులేట్ల‌లోనూ జాతీయ జెండాను దించ‌నున్నారు. దేశ‌వ్యాప్తంగా రేపు ప్ర‌జా సంబంధిత కార్య‌క్ర‌మాల‌ను ర‌ద్దు చేస్తున్నారు. రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌జ‌లంద‌రూ మూడు నిమిషాల పాటు కోవిడ్‌19 మృతుల‌కు మౌన నివాళి అర్పించ‌నున్నారు. logo