బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Mar 26, 2020 , 13:05:39

క‌రోనాపై పోరుకు భార‌త్‌కు తోడుంటాం: చైనా

క‌రోనాపై పోరుకు భార‌త్‌కు తోడుంటాం: చైనా

కరోనా వైరస్‌ నియంత్రణకు భారత్‌కు స‌హాయ‌ సహకారం అందిస్తామని చైనా వ్యాఖ్యనించింది. కష్ట సమయంలో భారత్‌ తమకు అండగా నిలిచిందని చైనా  విదేశాంగ శాఖ తెలిపింది.  ఈ నేప‌థ్యంలో మహమ్మారి కరోనాను కట్టడి చేయడంలో తమ అనుభవాలను, చేపట్టిన చర్యలను భారత్‌తో పంచుకుంటామని వివ‌రించింది. చైనాలో కరోనా వైరస్‌ నివారణకు భారత్‌ ఎంతో తోడ్పాటు అందించింద‌ని చెప్పిన చైనా...క‌రోనాపై భార‌త్ ఎంతో పోరాడుతుంద‌ని ప్ర‌శంసించింది. అటు ఇండియా ప్రారంభ ద‌శ‌లోనే క‌రోనాపై విజ‌యం సాధిస్తుంద‌ని తాము న‌మ్ముతున్నామ‌ని పేర్కొంది.


logo
>>>>>>