శనివారం 30 మే 2020
International - Apr 26, 2020 , 02:11:43

చైనా మూడో వ్యాక్సిన్‌

చైనా మూడో వ్యాక్సిన్‌

బీజింగ్‌: కరోనా వైరస్‌పై పోరాడేందుకు మూడో వ్యాక్సిన్‌కు సంబంధించి రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ (మానవులపై వ్యాక్సిన్‌ పరీక్షలు)కు చైనా అనుమతినిచ్చింది. చైనా జాతీయ ఫార్మాస్యూటికల్‌ గ్రూప్‌ (సినోఫార్మ్‌), వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (డబ్ల్యూఐవీ) నేతృత్వంలో వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయలాజికల్‌ ప్రొడక్ట్స్‌ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌ చైతన్య రహితమైనది. వైరస్‌ కణాలు, బ్యాక్టీరియా, ఇతర వ్యాధికారక సూక్ష్మజీవులు (ప్యాథోజెన్స్‌)ను కలిగి ఉన్న వ్యాక్సిన్‌ను చైతన్య రహితమైనదిగా పేర్కొంటారు. ఇవి వ్యాధికారక శక్తిని కోల్పోయి ఉంటాయి. అయితే, ప్రత్యక్ష వ్యాక్సిన్‌లో బతికున్న ప్యాథోజెన్స్‌ ఉంటాయి. 96 మందిపై తొలిదశ క్లినికల్‌ ట్రయల్స్‌ను ఏప్రిల్‌ 23న ఆరంభించామని, ఆ ప్రయోగాల్లో వ్యాక్సిన్‌ మంచి ఫలితాలను ఇచ్చిందని సినోఫార్మ్‌ తెలిపింది. 


logo