శనివారం 06 జూన్ 2020
International - May 22, 2020 , 15:58:15

హాంగ్‌కాంగ్ భ‌ద్ర‌త‌పై చైనా కొత్త చ‌ట్టం

హాంగ్‌కాంగ్ భ‌ద్ర‌త‌పై చైనా కొత్త చ‌ట్టం

హైద‌రాబాద్‌: హాంగ్‌కాంగ్ జాతీయ భ‌ద్ర‌త‌కు సంబంధించి చైనా ఓ వివాదాస్ప‌ద  చ‌ట్టాన్ని రూపొందించిన‌ట్లు తెలుస్తున్న‌ది. చైనా క‌మ్యూనిస్టు పార్టీ దీనిపై తీర్మానం చేసింది.  ఆ చ‌ట్టం వ‌ల్ల హాంగ్ కాంగ్ స్వేచ్ఛ‌కు భారీ విఘాతం క‌ల‌గ‌నున్న‌ది. హాంగ్‌కాంగ్ ప్ర‌తిప‌త్తిపై ఇది దాడి అని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అయితే త‌మ స్వేచ్ఛ‌కు భంగం క‌ల‌గ‌కుండా చైనాకు స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు హాంగ్ కాంగ్ చెప్పింది.  చైనా రూపొందించిన కొత్త చ‌ట్టం వ‌ల్ల మార్కెట్లు ప‌త‌నమైన‌ట్లు తెలుస్తోంది.   నేష‌న‌ల్ పీపుల్స్ కాంగ్రెస్ స‌మావేశాల్లో ఈ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. హాంగ్‌కాంగ్‌లో జాతీయ భ‌ద్ర‌త‌ను పెంచేందుకు అవ‌స‌ర‌మైన చ‌ట్టాల‌ను రూపొందిస్తున్న‌ట్లు చైనా ప్ర‌ధాని లీ కీక్వాంగ్ తెలిపారు. చైనా పెత్త‌నాన్ని వ్య‌తిరేకిస్తూ గ‌త ఏడాది నుంచి హాంగ్‌కాంగ్‌లో భారీ నిర‌స‌న‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.logo