శనివారం 06 జూన్ 2020
International - May 17, 2020 , 10:50:33

వైర‌స్ కేసుల‌పై జాంగ్ నాన్‌షాన్ ఆందోళ‌న‌

వైర‌స్ కేసుల‌పై జాంగ్ నాన్‌షాన్ ఆందోళ‌న‌

హైద‌రాబాద్‌: చైనాలో మ‌ళ్లీ వైర‌స్ కేసులు అత్య‌ధిక స్థాయిలో పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి.  ఆ దేశానికి చెందిన శ్వాస‌కోస నిపుణుడు జాంగ్ నాన్‌షాన్ దీనిపై వార్నింగ్ ఇచ్చారు. రెండో సారి క‌రోనా కేసులు చైనాను అత‌లాకుతం చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న ఓ మీడియా సంస్థ‌కు తెలిపారు. రెండో ద‌ఫా వ‌చ్చే వైర‌స్ సంక్ర‌మ‌ణ కేసులు పెను స‌వాల్‌గా మార‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  ప్ర‌జ‌ల్లో రోగ‌నిరోధ‌క శ‌క్తి లేక‌పోవ‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంద‌న్నారు.  అయితే అధికారులు మాత్రం ఎటువంటి నిర్ల‌క్ష్యం వ‌హించ‌రాద‌న్నారు. రెండో ద‌శ వైర‌స్ కేసులు పెరిగే ప్ర‌మాదం ఉన్న నేప‌థ్యంలో..  జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. ఇటీవ‌ల వుహాన్‌తో పాటు చైనాలోని ప‌లు ప్రాంతాల్లో మ‌ళ్లీ వైర‌స్ కేసులు అధికం అయ్యాయి.  దీంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. చైనా ఓ పెద్ద స‌వాల్‌ను ఎదుర్కొంటోంద‌ని, ప్ర‌స్తుతం త‌రుణంలో ఇత‌ర దేశాల క‌న్నా మెరుగైన స్థానంలో లేమ‌ని జాంగ్ నాన్‌షాన్ తెలిపారు.  ఇమ్యూనిటీ లేక‌పోవ‌డం వ‌ల్ల చాలా మంది వైర‌స్‌కు బ‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు. logo