గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Sep 07, 2020 , 18:19:06

స్వదేశీ కొవిడ్‌ టీకాను తొలిసారి ప్రదర్శించిన చైనా..!

స్వదేశీ కొవిడ్‌ టీకాను తొలిసారి ప్రదర్శించిన చైనా..!

బీజింగ్‌: కొవిడ్ -19 వ్యాధి వ్యాప్తికి కారణంగా భావిస్తున్న చైనా తన స్వదేశీ వ్యాక్సిన్‌ను తొలిసారి ప్రదర్శనకు ఉంచింది. ఆ దేశ రాజధాని బీజింగ్‌లో జరిగిన ట్రేడ్‌ ఫేర్‌లో (వాణిజ్య సంత) వ్యాక్సిన్‌ను ఎగ్జిబిట్‌ చేశారు. ఈ టీకాను చైనా కంపెనీలైన సినోవాక్ బయోటెక్, సినోఫార్మ్ అభివృద్ధి చేశాయి. అయితే, ఇది మార్కెట్‌లోకి ఇంకా అందుబాటులోకి రాలేదు. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన తర్వాత ఈ ఏడాది చివరికల్లా మార్కెట్‌లోకి వస్తుందని తయారీదారులు పేర్కొంటున్నారు. 

‘టీకా ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని నిర్మించాం. ఇందులో ఏడాదికి 300 మిలియన్ మోతాదులను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. ’ అని సినోవాక్‌ ప్రతినిధి వెల్లడించారు. కాగా, ట్రేడ్‌ ఫేర్‌కు వచ్చిన జనం వ్యాక్సిన్‌ ఉంచిన ప్రదేశం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారు. టీకాను చూసి సంబురపడిపోయారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo