గురువారం 21 జనవరి 2021
International - Jan 05, 2021 , 17:13:10

లంచాలు తీసుకున్న కేసులో చైనీయుడికి మ‌ర‌ణ‌శిక్ష‌

లంచాలు తీసుకున్న కేసులో చైనీయుడికి మ‌ర‌ణ‌శిక్ష‌

బీజింగ్‌: చైనాలోని హువ‌రాంగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మాజీ చైర్మ‌న్ లాయి జియోమిన్‌కు మ‌ర‌ణ‌శిక్ష ప‌డింది.  లంచాలు తీసుకున్న కేసులో అత‌నికి ఈ శిక్ష విధించారు.  సుమారు 260 మిలియ‌న్ల డాల‌ర్ల అవినీతికి పాల్ప‌డిన‌ట్లు అత‌నిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2008 నుంచి 2018 మ‌ధ్య కాలంలో ఆ అవినీతి చోటుచేసుకున్న‌ది.  తియాన్‌జిన్ సిటీ కోర్టు ఇవాళ తీర్పును వెలువ‌రించింది.  బ్యాంక‌ర్ జియోమిన్‌కు చెందిన వ్య‌క్తిగ‌త ఆస్తుల‌న్నింటినీ జ‌ప్తు చేస్తున్న‌ట్లు కోర్టు త‌న తీర్పులో వెల్ల‌డించింది. రెండు పెళ్లిళ్లు చేసుకున్న కేసులోనూ అతనికి శిక్ష‌ను విధించారు. లాయి జియోమిన్ చ‌ట్టాల‌ను ఉల్లంఘించారని, అత్యాశ‌తో వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  


logo