గురువారం 04 జూన్ 2020
International - Apr 06, 2020 , 01:46:30

పాక్‌కు చైనా అండర్‌వేర్‌ మాస్క్‌లు

పాక్‌కు చైనా అండర్‌వేర్‌ మాస్క్‌లు

ఇస్లామాబాద్‌: చిరకాల మిత్రదేశం పాకిస్థాన్‌ను సైతం చైనా మోసపుచ్చింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో టెస్టింగ్‌ కిట్‌లు, నాణ్యమైన ఎన్‌-95 మాస్క్‌లు అందిస్తామని ఆ దేశానికి హామీ ఇచ్చిన చైనా.. చివరకు అండర్‌వేర్లతో తయారుచేసిన మాస్క్‌లను పంపించింది. చైనా తమను మోసం చేసిందని స్థానిక వార్తాచానల్‌ పేర్కొంది. సింధ్‌ రాష్ట్ర అధికారులు వాటిని తనిఖీ చేయకుండానే కరాచీలోని దవాఖానకు తరలించినట్లు తెలిపింది. మొత్తంగా చైనా 2 లక్షల సాధారణ మాస్క్‌లు,  2 వేల ఎన్‌-95 మాస్క్‌లు, 5 వేలవెంటిలేటర్లు, 2 వేలు టెస్టింగ్‌ కిట్‌లు, 2 వేలు ప్రొటెకివ్‌ దుస్తులను పాక్‌కు పంపింది. logo