బుధవారం 03 జూన్ 2020
International - May 07, 2020 , 11:32:17

అమెరికాలో చైనా సైంటిస్టు హ‌త్య

అమెరికాలో చైనా సైంటిస్టు హ‌త్య

న్యూఢిల్లీ: అమెరికాలో చైనాకు చెందిన సైంటిస్టు హ‌త్య‌కు గుర‌య్యాడు. కరోనా వైరస్‌పై కీలక పరిశోధనలు చేస్తున్న చైనా సైంటిస్టు బింగ్ లియు (37) రెండు రోజుల క్రితం తన ఇంట్లో శవమై కనిపించారు. అత‌నితోపాటు అతనికి అత్యంత స‌న్నిహితంగా ఉండే హోగూ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా విగ‌త‌జీవిగా ప‌డి ఉన్నాడు. పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసే బింగ్ లియుని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హోగు కాల్చి చంపి, ఆ త‌ర్వాత త‌న‌ను తాను కాల్చుకుని చ‌నిపోయి ఉంటాడ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. లియు పరిశోధనలకు, ఈ హత్యకు సంబంధం ఉండి ఉండొచ్చనే కోణంలో కూడా పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 


logo