శనివారం 30 మే 2020
International - Apr 29, 2020 , 19:49:34

అమెరికా యుద్ధనౌకలను పంపేశామన్న చైనా

అమెరికా యుద్ధనౌకలను పంపేశామన్న చైనా

హైదరాబాద్: దక్షిణ చైనా సముద్రంలో తమ జలాల్లోకి అమెరికా యుద్ధనౌకలు ప్రవేశించినప్పుడు చైనా నౌకాదళం వాటిని చుట్టుముట్టి పంపించి వేసిందని చైనా సైన్యం తెలిపింది. అమెరికా నౌకతో పాటుగా ఆస్ట్రేలియా నౌక కూడా వాటిలో ఉందని పేర్కొన్నది. దీనిని రెచ్చగొట్టే చర్యగా పేర్కొన్నది. ప్రాంతీయ శాంతిభద్రతలను దెబ్బతీసే బదులుగా అమెరికా సైన్యం స్వదేశంలో కోరనా కట్టడికి కృషి చేస్తే బాగుంటుందని చైనా సైన్యం సలహా ఇచ్చింది. చైనాలో షీశా దీవులు అని పిలిచే పారసెల్ దీవుల దగ్గర, వియత్నాం హోంగ్ సా ద్వీపవలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. అక్కడ ఉండే 30 దీవులు ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉన్నాయి. అయితే అవి తమకే చెందుతాయని 1949లో చైనా నుంచి విడిపోయిన తైవాన్ అంటున్నది. యావత్తు దక్షిణ చైనా సముద్రం తన ప్రాబల్యం ప్రాంతమని చైనా అంటున్నది. దీనిని అమెరికా, జపాన్ తదితర దేశాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ అంశంపై తరచుగా చైనాకు, ఇతర సదేశాలకు మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి.


logo