బుధవారం 03 జూన్ 2020
International - May 08, 2020 , 09:24:18

వైర‌స్‌పై విచార‌ణ‌.. డ‌బ్ల్యూహెచ్‌వోకు స‌హ‌క‌రిస్తామ‌న్న చైనా

వైర‌స్‌పై విచార‌ణ‌.. డ‌బ్ల్యూహెచ్‌వోకు స‌హ‌క‌రిస్తామ‌న్న చైనా

హైద‌రాబాద్‌:  చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి క‌రోనా వైర‌స్ వ్యాపించిన‌ట్లు అగ్ర‌రాజ్యం అమెరికా ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. కోవిడ్19 వ్యాధి నియంత్ర‌ణ‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పాత్ర‌పై కూడా అనుమానాలు ఉన్న‌ట్లు ఆ దేశం పేర్కొన్న‌ది. ఈ నేప‌థ్యంలో డ్రాగ‌న్ దేశం చైనా స్పందించింది. వైర‌స్ పుట్టుక‌ గురించి విచార‌ణ చేప‌ట్టేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ‌కు చైనా అనుమ‌తి ఇచ్చింది. కానీ విచార‌ణ శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో జ‌ర‌గాల‌ని కోరుకున్న‌ది. రాజ‌కీయ కోణంలో వైర‌స్ గురించి విచార‌ణ చేప‌ట్ట‌రాద‌న్న‌ది. 

వైర‌స్ విష‌యంలో చైనా నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని అమెరికా ఆరోపిస్తూనే ఉన్న‌ది. మ‌హ‌మ్మారిని తొలి ద‌శ‌లోనే ఆ దేశం నియంత్రించ‌లేద‌ని పేర్కొన్న‌ది. అయితే ఆ ఆరోప‌ణ‌ల‌ను చైనా ఖండించింది. అంతేకాదు, క‌రోనా వైర‌స్ ముందుగానే ఇత‌ర ప్ర‌దేశాల్లో పుట్టిన‌ట్లు చైనా తాజాగా చెబుతూ వ‌స్తున్నది.  వుహాన్ ల్యాబ్ నుంచి వైర‌స్ వ్యాపించిన‌ట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో చేసిన ఆరోప‌ణ‌ల‌ను కూడా చైనా ఖండించింది. ఒక త‌ప్పును క‌ప్పి పుచ్చేందుకు అమెరికా మ‌రో త‌ప్పు చేస్తున్న‌ట్లు చైనా విమ‌ర్శించింది. 

శుక్ర‌వారం రోజున చైనాలో కొత్త‌గా ఒక్క కేసు మాత్రమే న‌మోదు అయ్యింది.  విదేశాల నుంచి వ‌చ్చిన వారి నుంచి ఎటువంటి కేసులు న‌మోదు కాలేదు.  ఎటువంటి మ‌ర‌ణాలు కూడా న‌మోదు కాలేద‌ని ఆ దేశం తెలిపింది.  కానీ ఎటువంటి ల‌క్ష‌ణాలు లేని 16 కేసులు బ‌య‌ట‌ప‌డిన‌ట్లు చైనా పేర్కొన్న‌ది. logo