గురువారం 28 మే 2020
International - May 19, 2020 , 13:25:30

వ్యాక్సిన్ అవసరం లేదు.. చైనా మందు కనిపెట్టిందట

వ్యాక్సిన్ అవసరం లేదు.. చైనా మందు కనిపెట్టిందట

బీజింగ్: కరోనా పోదు.. వ్యాక్సిన్ రాదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చిచెప్పింది. వైరస్‌తో సహజీవనానికి అలవాటు పడాలని వైద్యనిపుణులు చెప్తున్నారు. ఆ సహజీవనానికి అవసరమైన మందును కనిపెట్టినట్టు చైనా చెప్పుకుంటున్నది. ప్రపంచం మీదకు ఎగబాకే ముందు వైరస్ తొలిగా బయటపడింది చైనా లోనే. ఇప్పుడు మందు కూడా తామే కనిపెట్టామని చైనా అంటున్నది. ఆ మందు వైరస్ వల్ల వచచే జబ్బును నయం చేయడమే కాకుండా కొంతకాలంపాటు టీకాలా పని చేస్తుందని అంటున్నారు.

చైనాలోని ప్రతిష్ఠాత్మక పెకింగ్ యూనివర్సిటీకి చెందిన బీజింగ్ అడ్వాన్స్‌డ్ ఇన్నవేషన్ సెంటర్ ఫర్ జెనోమిక్స్ తయారు చేసిన మందు జంతువులపై బాగా పనిచేసిందని డైరెక్టర్ సన్నీ సియే తెలిపారు. వైరస్ సోకిన ఎలుకల్లోకి తటస్థీకరించిన యాంటీబాడీలను పంపితే పంపితే వైరల్ లోడ్ 2500 వందల రెట్లు తగ్గిపోయిందని ఆయన వివరించారు. శాస్త్రరంగ జర్నల్ సెల్ లో ఈ పరిశోధన తాలూకు వివరాలను ఆదివారం ప్రచురించారు. చైనాలో 700 మందికిపైగా రోగులకు ప్లాస్మా చికిత్స జరిపారు. ఫలితాలు బాగానే ఉన్నప్పటికీ ప్లాస్మా పరిమితంగానే లభిస్తుంది. అందుకే తటస్థీకరించిన యాంటీబాడీలను ఉపయోగించి చూశామని సియే తెలిపారు. యాంటీబాడీలను ఉపయోగించి జరిపే ఈ చికిత్స ద్వారా కోలుకోవడం మాత్రమే కాకుండా సత్వరమే కోలుకోవడం విశేషమని సియే చెప్పారు.

ఏక కణ జన్యు పద్ధతిలో ఈ మందును రూపొందించారు. మనుషులపై ప్రయోగాలు పూర్తయితే ఇక సంవత్సరాంతానికి మందు అందుబాటులో ఉంటుందని చైనా సియే తెలిపారు. చైనాలో కరోనా తగ్గిపోయిన కారణంగా మానవ పరీక్షలు ఆస్ట్రేలియా లేదా మరే ఇతర దేశంలో జరగొచ్చని చెప్పారు. తటస్థీకరించిన యాంటీబాడీలు ప్రత్యేక ఔషధంగా పనిచేసి విశ్వమహమ్మారిని అంతమొందిస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.


logo