సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 10, 2020 , 19:16:35

ఆ దోస్తీ మ‌ధ్య‌ప్రాచ్యానికి ప్ర‌మాదక‌రం: ‌మైక్ పాంపియో

ఆ దోస్తీ మ‌ధ్య‌ప్రాచ్యానికి ప్ర‌మాదక‌రం: ‌మైక్ పాంపియో

న్యూఢిల్లీ: చైనా-ఇరాన్‌ దౌత్య సంబంధాలపై అమెరికా విదేశాంగ‌ మంత్రి మైక్‌ పాంపియా ట్విటర్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో గనుక ఇరాన్‌ దోస్తీ చేస్తే మధ్యప్రాచ్యంలో పరిస్థితులు తారుమారవుతాయని హెచ్చరించారు. ఇరాన్‌ ఇప్పటికే ఉగ్రవాదులకు అడ్డాగా ఉందని, చైనా వ్యూహంలో చిక్కుకుంటే ఇక ఎప్ప‌టికీ అలాగే మిగిలిపోయే ప్ర‌మాదం ఉంద‌ని పాంపియో పేర్కొన్నారు. ఆయుధ వ్యవస్థలు, వాణిజ్యం, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చే డబ్బులకు ఆశపడటం అంటే ఆ ప్రాంతాన్ని ప్రమాదంలోకి నెట్టడమేనని పాంపియో ట్విటర్లో అభిప్రాయ‌ప‌డ్డారు. 

హాంగ్‌కాంగ్‌ ప్రజాస్వామ్యవాదులను, ముఖ్యంగా ముస్లిం పౌరుల హక్కులను చైనా కాలరాస్తున్న ఉదంతాలే ప్ర‌పంచ దేశాలకు చైనా నుంచి ముప్పు పొంచి ఉంద‌న‌డానికి నిద‌ర్శ‌న‌మ‌ని పాంపియో పేర్కొన్నారు. అయితే, చాలా దేశాలు డ్రాగన్‌ పడగ నుంచి బయటపడేందుకు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి చర్యలు ప్రారంభించాయని ట్వీట్‌చేశారు. చైనాలో ఉంటున్న అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా పాంపియో సూచించారు. చాబహార్‌ రైల్వేలైన్ ఒప్పందం నుంచి భారత్‌ని తప్పించిన ఇరాన్‌ డ్రాగన్‌ కంట్రీని దగ్గరవుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో పాంపియో వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo