శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 17, 2020 , 11:33:46

లెక్కల సవరణ.. చైనాలో బాధితులు, మృతుల సంఖ్య పెరిగింది

లెక్కల సవరణ.. చైనాలో బాధితులు, మృతుల సంఖ్య పెరిగింది

హైదరాబాద్: ప్రపంచాన్ని ఊపేస్తున్న కరోనా కల్లోలానికి మూలబిందువైన వూహాన్‌లోని లెక్కలను చైనా సవరించింది. మొత్తం కరోనా కేసులు 325 పెరిగి 50,333కి, మరణాలు 1290 పెరిగి 3869కి చేరుకున్నాయి.  దీనివల్ల దేశవ్యాప్త మరణాలు 40 శాతం పెరిగి 4636కు చేరుకున్నాయని జిన్‌హువా వార్తాసంస్థ తెలిపింది. అత్ధిక మరణాలు మధ్యచైనాలోని హూబెయ్ ప్రావిన్స్‌లోనే సంభవించాయి. వూహాన్ ఉన్నది ఈ ప్రావిన్స్‌లోనే. చైనా వెల్లడించిన సంఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ సవరణలు జరగడం గమనార్హం. వూహాన్ అదికారులు కరోనా కేసుల సంఖ్యను కూడా 325 వరకు పెంచారు. నిన్నటివరకు సంఖ్యలను మొండిగా సమర్థించుకున్న చైనా హటాత్తుగా సవరించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఈ సంఖ్యల సవరణకు ప్రధానంగా నాలుగు కారణాలు చూపారు. మహమ్మారి విస్తరిస్తున్న తొలిదశలో అందరూ ఆస్పత్రులకు రాలేకపోయారని, కొందరు ఇంటివద్దే చికిత్స లేకుండా మరణించారని తెలిపింది. వైద్యులు చికిత్స పనుల్లో తలమునకలుగా ఉండడంతో లెక్కింపు పూర్తి చేయలేకపోయారు. అదేవిధంగా ప్రధానమైన నెట్‌వర్క్‌తో అనుసంధానించని ఆస్పత్రుల లెక్కలు కూడా ఆలస్యంగహా వచ్చాయి. కొందరు రోగుల వివరాలు సరిగా లేకపోవడంతో వాటిని సరిచేసి లెక్కలు చూసుకునేసరికి కొంత సమయం పట్టింది. ఎట్టకేలకు లెక్కలు సవరించడంతో ప్రాణాలకు విలువ ఇచ్చినట్టు అయిందని వూహాన్‌కు చెందిన ఓ అధికారి అన్నారు.


logo