శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Mar 24, 2020 , 13:58:43

చైనాలో పెరుగుతున్న విదేశీ కేసులు

చైనాలో పెరుగుతున్న విదేశీ కేసులు

హైద‌రాబాద్‌: చైనాలో మ‌ళ్లీ వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. అయితే విదేశాల నుంచి వ‌చ్చిన వారిలో ఈ వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి.  దీంతో రెండో ద‌ఫా ఇన్ఫెక్ష‌న్లు సోకుతున్న‌ట్లు ప్రాథ‌మికంగా తెలుస్తోంది.  చైనాలో కొత్త‌గా 78  కోవిడ్‌19 కేసులు న‌మోదు అయిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.  వుహాన్‌లో సుమారు వారం రోజుల త‌ర్వాత ఒక కొత్త కేసు నమోదు అయ్యింది. గ‌త ఏడాది ఇదే న‌గ‌రం కేంద్రంగా మ‌హ‌మ్మారి క‌రోనా విజృంభించిన విష‌యం తెలిసిందే.  విదేశాల నుంచి వ‌చ్చిన వారి వ‌ల్ల 74 కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం జాతీయ హెల్త్ క‌మిష‌న్ పేర్కొన్న‌ది. వుహాన్‌లో ఇవాళ ఏడు మంది మ‌ర‌ణించిన‌ట్లు కూడా చైనా ఆరోగ్య సంస్థ పేర్కొన్న‌ది.  


logo