సోమవారం 13 జూలై 2020
International - May 26, 2020 , 02:11:20

వివిధ దేశాల్లో పరిస్థితి

వివిధ దేశాల్లో పరిస్థితి

చైనాలో కొత్తగా 51 కేసులు

బీజింగ్‌: చైనాలో కొత్తగా 51 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 38 మంది వుహాన్‌ వాసులే. 10 కేసులు మంగోలియా అటానమస్‌ రీజియన్‌, ఒక కేసు సిచువాన్‌ రాష్ట్రంలో నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన వారిలోమిగతా కేసులు రికాైర్డెనట్లు  జాతీయ ఆరోగ్య కమిషన్‌ అధికారులు తెలిపారు. వుహాన్‌లో గత పది రోజులుగా 60 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. 

ఇంగ్లాండ్‌లో జూన్‌ 1 నుంచి..  తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు (1-6 తరగతులు) తెరువనున్నట్టు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. సెకండరీ స్కూళ్లు 15 నుంచి తెరుస్తామన్నారు. 

ఆస్ట్రేలియాలో స్కూళ్లు ఓపెన్‌: సౌత్‌వేల్స్‌, క్వీన్‌లాడ్‌, దక్షిణ, ఉత్తరాది రాష్ర్టాల్లో  సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి.

న్యూజిలాండ్‌ సడలింపులు: బహిరంగ ప్రదేశాల్లో వందమంది  గుమిగూడేందుకు అవకాశం కల్పిం చింది. జూన్‌ 22 నుంచి ఆంక్షలను  పూర్తిగా ఎత్తియనున్నట్టు సమాచారం.  

ప్రయాణంపై నిషేధం: బ్రెజిల్‌ నుంచి అమెరికాకు ప్రజల రాకపోకలపై ట్రంప్‌ నిషేధం విధించారు. బ్రెజిల్‌లో కరోనా కేసులు పెరుగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

జపాన్‌లో ఎమర్జెన్సీ ఎత్తివేత: టోక్యోతోపాటు నాలుగు ప్రాంతాల్లో ఉన్న ఎమర్జెన్సీని జపాన్‌ ఎత్తివేసింది. దీంతో జపాన్‌ మొత్తం ఆంక్షల నుంచి విముక్తి పొందింది.  

స్పెయిన్‌లో రెస్టారెంట్లు ఓపెన్‌: స్పెయిన్‌లో సోమవారం బీచ్‌లు, రెస్టారెంట్లను తెరిచారు. సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల్లో పరిమిత సంఖ్య లో పాల్గనే అవకాశమిచ్చారు. 


logo