గురువారం 04 జూన్ 2020
International - May 21, 2020 , 13:25:21

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

బీజింగ్‌: కరోనా వైరస్‌ పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 33 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఇందులో ఎక్కువగా ఈ ప్రాణాంతక వైరస్‌ మొదటిసారిగా బయటపడ్డ వుహాన్‌లోనే ఉన్నాయి. వైరస్‌ రెండో దశలో భాగంగా వుహాన్‌ పట్టణంలో ఇప్పటివరకు 11 మిలియన్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని చైనా హెల్త్‌ కమిషన్‌ ప్రకటించింది. బుధవారం ఒక్కరోజే దేశంలో కరోనా లక్షణాలున్న 861 మందిని పరీక్షించింది. ఇందులో వుహాన్‌కు 281 మంది సంబంధించిన వారేకావడం గమనార్హం. ఇప్పటివరకు చైనా ప్రధాన భూభాగంలో కరోనా వైరస్‌తో 4634 మంది చనిపోగా, 82,967 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  


logo