శనివారం 06 జూన్ 2020
International - May 10, 2020 , 11:49:07

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌లు

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌లు

బీజింగ్‌: కరోనా మహమ్మారి నుంచి చైనా పూర్తిగా కోలుకుంటున్న తరుణంలో మరోమారు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని జాతీయ ఆరోగ్య కమిషన్‌ ప్రకటించింది. అయితే మృతులెవ్వరూ లేదని తెలిపింది. అందులో 11 జిలిన్‌ ప్రావిన్సుకు చెందినవికాగా, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ఉన్నారు. ఏప్రిల్‌ 28 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 82,901కి చేరింది. ఈ వైరస్‌ ప్రభావంతో చైనాలో ఇప్పటివరకు 4633 మంది మరణించారు.


logo