బుధవారం 27 మే 2020
International - Apr 13, 2020 , 10:02:00

చైనాలో కొత్తగా 108 పాజిటివ్ కేసులు..

చైనాలో కొత్తగా 108 పాజిటివ్ కేసులు..

హైద‌రాబాద్: చైనాలో మ‌ళ్లీ కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి. ఆరు వారాల బ్రేక్ త‌ర్వాత ఈ రికార్డు న‌మోదు అయ్యింది. కొత్త‌గా ఆ దేశంలో ఆదివారం 108 కేసులు న‌మోదు అయ్యాయి. దాంట్లో 98 మంది విదేశాల నుంచి వ‌చ్చిన‌వారే ఉన్నారు.  దీంతో మ‌ళ్లీ ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. విదేశాల నుంచి వ‌చ్చిన‌వారితో క‌రోనా కేసులు రెండ‌వ‌సారి పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.  వైర‌స్‌కు కేంద్ర‌బిందువైన వుహాన్ న‌గ‌రం 11 వారాల లాక్‌డౌన్ త‌ర్వాత ఇటీవ‌లే తెరుచుకున్న‌ది. ఆదివారం ఆ దేశంలో మ‌రో ఇద్ద‌రు మృతిచెందారు. దీంతో చైనాలో వైర‌స్ మృతుల సంఖ్య 3341కి చేరుకున్న‌ది. ఎటువంటి ల‌క్ష‌ణాలు కూడా లేని 61 కేసులు ఆదివారం కొత్త‌గా న‌మోదు అయ్యాయి. అయితే ఆ కేసుల‌ను చైనా పాజిటివ్ కేసులుగా భావించ‌డంలేదు. చైనాలో దిగుమ‌తి అయిన కేసుల్లో ఎక్కువ‌శాతం ర‌ష్యా నుంచి వ‌చ్చిన‌వారే ఉన్నారు.logo