గురువారం 01 అక్టోబర్ 2020
International - Jul 29, 2020 , 16:17:33

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు!

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు!

బీజింగ్‌: కరోనా వైరస్‌కు కేంద్రస్థానంగా భావిస్తున్న చైనా దేశంలో మళ్లీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా, 101 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ మధ్య నుంచి నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. ఈ విషయాన్ని ఆదేశ జాతీయ ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది. 

కొత్త కేసుల్లో 89 జిన్జియాంగ్‌లో నమోదయ్యాయి. స్వయంప్రతిపత్తిగల ఈ ప్రాంతంలో కొవిడ్‌ పరీక్షలను ఎక్కువ సంఖ్యలో చేస్తున్నారు. లియోనింగ్‌లో ఎనిమిది, బీజింగ్‌లో ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది.  27 మంది రోగులకు లక్షణాలు(అసింప్టోమాటిక్‌) లేవని గుర్తించారు. దీంతో చైనాలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 84,060కి చేరుకుంది. ప్రస్తుతం 273 మంది అసింప్టోమాటిక్ రోగులు వైద్య పరిశీలనలో ఉన్నారు. మృతుల సంఖ్య 4,664 గా ఉంది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్చి 11న కొత్త కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 6,50,000 దాటింది. కొవిడ్‌ కేసుల సంఖ్య 16.3 మిలియన్లను అధిగమించింది.    


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo