బుధవారం 27 మే 2020
International - May 11, 2020 , 09:21:48

చైనాలో కొత్త‌గా 17 కేసులు.. లాక్‌డౌన్‌లో షూల‌న్ న‌గ‌రం

చైనాలో కొత్త‌గా 17 కేసులు.. లాక్‌డౌన్‌లో షూల‌న్ న‌గ‌రం

హైద‌రాబాద్‌: చైనాలో మ‌ళ్లీ క‌రోనా పాజిటివ్ కేసుల క‌ల‌వరం మొద‌లైంది. సోమ‌వారం ఒక్క రోజే ఆ దేశంలో 17 కేసులు న‌మోదు అయ్యాయి. దీంట్లో అయిదు కేసులు వైర‌స్‌కు కేంద్ర బిందువైన వుహాన్ న‌గ‌రంలోనే చోటుచేసుకున్నాయి. చైనాలోని ఈశాన్యంలో ఉన్న జిలిన్ ప్రావిన్సులోని షూల‌న్ న‌గరంలో కొత్త‌గా ఎక్కువ‌ కేసులు న‌మోదు అవుతున్నాయి.  దీంతో ఆ న‌గ‌రాన్ని లాక్‌డౌన్ చేశారు. ఆదివారం ఒక్క రోజే ఆ న‌గ‌రంలో 11 కేసులు న‌మోదు అయ్యాయి. ఈ కేసుల‌న్నీ ఓ దోబీ మ‌హిళ‌కు లింకై ఉన్న‌‌ట్లు అధికారులు గుర్తించారు. దోబీ వృత్తి చేప‌ట్టే 45 ఏళ్ల‌ మ‌హిళ మొద‌ట త‌న భ‌ర్త‌కు, సోద‌రుల‌కు, ఆ త‌ర్వాత ఫ్యామిలీ స‌భ్యులంద‌రికీ వైర‌స్‌ను అంటించింది. వాస్త‌వానికి ఆమెకు ఎటువంటి ట్రావెల్ హిస్ట‌రీ లేదు.  

వైర‌స్ కేసులు బ‌య‌ట‌ప‌డ‌డంతో షూల‌న్ న‌గ‌రంలో ఉన్న అన్ని ప‌బ్లిక్ స్థ‌లాల‌ను మూసివేశారు.  న‌గ‌ర‌వాసులంద‌ర్నీ ఇండ్ల‌ల్లోనే ఉండాలంటూ ఆదేశించారు. ప్ర‌జా రవాణా వ్య‌వ‌స్థ‌ను నిలిపేశారు.  ఆ న‌గ‌రాన్ని హైరిస్క్ ప్రాంతంగా ప్ర‌క‌టించారు.  దోబీ వృత్తి చేసే మ‌హిళ‌కు వైర‌స్ సోక‌డంతో.. చైనాలోని సోష‌ల్ మీడియాలో ఇదే చ‌ర్చాంశ‌మైంది. ఆమెకు ఇన్‌ఫెక్ష‌న్ ఎలా సోకింద‌ని ఊహాగానాలు సాగాయి. అయితే ఉత్త‌ర కొరియా స‌రిహ‌ద్దులో జిలిన్ ప్రావిన్సు ఉన్న‌ది. ఆ రాష్ట్రంలోనే షూల‌న్ న‌గ‌రం ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో ఉత్త‌ర కొరియాలో కూడా భారీ సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్ కేసులు ఉండి ఉంటాయ‌ని ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. 


  logo