బీజింగ్ : ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan )లో జరుగుతున్న పరిణామాలపై డ్రాగన్ దేశం చైనా స్పందించింది. ఆఫ్ఘనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్ ఫైటర్లతో స్నేహ సంబంధాలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా వెల్లడించింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌కు పొరుగు దేశమైన రష్యా మాత్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలు కలవరపెడుతున్నట్లు రష్యా చెప్పింది. శరవేగంగా ఆఫ్ఘన్ రాజధానికి వశపరుచుకున్న తాలిబన్ల దూకుడు పట్ల అమెరికా కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అమెరికా ఇంటెలిజెన్స్ ఊహించిన దానికన్నా ముందే మిలిటెంట్లు కాబూల్‌లో పాగా వేశారు. ఏకంగా అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్న తీరు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను స్టన్ చేసినట్లు తెలుస్తోంది. తాలిబన్ల రాకతో దేశం విడిచిన వెళ్లిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. అరబ్ దేశమైన ఒమన్‌కు వెళ్లినట్లు సమాచారం ఉంది.