బుధవారం 03 జూన్ 2020
International - Apr 28, 2020 , 15:51:43

క‌రోనా టెస్టింగ్‌ కిట్ల‌పై చైనా రియాక్ష‌న్‌

క‌రోనా టెస్టింగ్‌ కిట్ల‌పై చైనా రియాక్ష‌న్‌

చైనా క‌రోనా కిట్ల‌ను ఉప‌యోగించ‌ద్దొన్న భార‌త్ సూచ‌న‌పై చైనా స్పందించింది. ర్యాపిడ్‌ టెస్టుల్లో ఫలితాలు తేడాగా రావడంతో... చైనా టెస్టింగ్ కిట్లపై సందేహం నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే వాటిని ఉపయోగించొద్దని ఐసీఎంఆర్ దేశంలోని అన్ని‌ రాష్ట్రాలకు సూచించింది. అయితే దీనిపై చైనా త‌న వాద‌న‌ను చెప్పుకొచ్చింది. కిట్ల దిగుమతి, స్టోరేజీ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా... చైనా ఉత్పత్తులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. చైనా గుడ్‌విల్‌, నిబద్ధతను భారత్ గౌరవిస్తుందని తాము భావిస్తున్నట్లు తెల్పింది. అటు పూణెలోని వైరాలజీ కిట్స్‌ను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు.,  ఐసీఎంఆర్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలోనే సమస్యకు పరిష్కారంభిస్తుందని చైనా రాయ‌బారి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఫ‌లితాల్లో తేడాలు రావ‌డంపై క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించి.. తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు సిద్దంగా ఉన్నామ‌న్నారు.logo