బుధవారం 03 జూన్ 2020
International - Mar 30, 2020 , 21:13:40

క‌రోనాపై పోరులో పాక్‌కు వెన్నంటి ఉంటున్న చైనా

 క‌రోనాపై పోరులో పాక్‌కు వెన్నంటి ఉంటున్న చైనా

 పాకిస్థాన్‌లోనూ క‌రోనా వైర‌స్‌ క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతోంది. ఈ ఉప‌ద్ర‌వం నుంచి పాక్‌ను గట్టేక్కించేందుకు త‌న మిత్రుడైన చైనా వెన్నంటే ఉంటుంది. ఆప‌త్కాలంలో వెన్నంటే ఉంటూ మ‌రోసారి త‌న విశ్వాసాన్ని చాటుకుంటుంది.  పాకిస్థాన్‌లో 16వంద‌ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు కాగా 18 మంది మ‌ర‌ణించారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే  వైద్య బృందాలతో పాటు, కరోనా టెస్టింగ్ కిట్స్, మాస్క్స్, ప్రొటెక్టివ్ సూట్స్, వెంటిలేటర్స్‌, మందులను పాక్‌కు పంపిన చైనా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. క‌రోనా బాధితుల‌కు చికిత్స అందించేందుకు వుహాన్ హాస్పిట‌ల్స్‌ నిర్మించిన‌ట్లుగానే..పాక్‌లో కూడా నిర్మించేందుకు చైనా పూనుకుంది. ఇప్ప‌టికే నిర్మాణ ప‌నులు కూడా ప్రారంభ‌మైన‌ట్లు చైనా ప్ర‌క‌టించింది.  అటు ఈ క‌ష్ట‌కాలంలో పాకిస్థాన్ ఏది కోరినా కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు చైనా అధికారులు తెలిపారు. ఇప్ప‌డే కాదు అన్ని ప‌రిస్థితుల్లో ముఖ్యంగా ఉగ్ర‌వాదంపై పోరులో పాక్ వైఖ‌రిని అంత‌ర్జాతీయంగా ప‌లుదేశాలు వేలెత్తిచూపినా...చైనా మాత్రం పాక్ కు ఎప్పుడూ మద్ద‌తుగానే నిలిచింది.


logo