బుధవారం 12 ఆగస్టు 2020
International - Jul 13, 2020 , 18:01:07

దేశ భద్రత కోసమే చైనా యాప్ లపై నిషేధం

దేశ భద్రత కోసమే చైనా యాప్ లపై నిషేధం

న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తత నేపథ్యంలో 59 చైనా యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. తమ యాప్ లపై నిషేధం విధించిన తరువాత చైనా అధికారుల్లో కొంత మేర మార్పు కనిపిస్తున్నది. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన డిప్లొమాటిక్ సమావేశంలో తమ దేశ యాప్‌ల నిషేధించిన అంశానని చైనా లేవనెత్తగా.. భారత్ అంటే ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. 

దౌత్య స్థాయిలో ఇరు దేశాల మధ్య జరిగిన సమావేశంలో 59 చైనా యాప్‌లను నిషేధించే అంశంపై చైనా పక్షం అభ్యంతరం లేవనెత్తిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దానికి భారత్ సరైన సమాధానం ఇచ్చిందని, దేశ భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నామని చైనాకు స్పష్టం చేసిందని, భారత పౌరులకు సంబంధించిన ఎలాంటి డేటా కూడా మూడో వ్యక్తికి అందకుండా చూస్తున్నట్టు వారు చెప్పినట్లు సమాచారం.

చైనా కంపెనీలు తమ యాప్‌ల ద్వారా భారతీయుల డేటాను సేకరించి పంపుతున్నాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి సమాచారం వచ్చిన తరువాత జూన్ 29 న భారత ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ యొక్క సెక్షన్ 69 ఏ కింద 59 చైనీస్ యాప్ లను నిషేధించారు. చైనా యాప్ ల నిషేధం తరువాత.. అంతర్జాతీయ విదేశాంగ పెట్టుబడిదారుల చట్టపరమైన హక్కులను పరిరక్షించడం భారతదేశ కర్తవ్యం అని చైనా విదేశాంగ శాఖ స్పందించింది.

తాజావార్తలు


logo