గురువారం 02 ఏప్రిల్ 2020
International - Feb 25, 2020 , 02:50:44

కరోనా భయంతో చైనా పార్లమెంట్‌ సమావేశాలు వాయిదా

కరోనా భయంతో చైనా పార్లమెంట్‌ సమావేశాలు వాయిదా

బీజింగ్‌, ఫిబ్రవరి 24: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తి కారణంగా చైనాలో మార్చి ఐదోతేదీ నుంచి ప్రారంభం కావాల్సిన వార్షిక పార్లమెంట్‌ సమావేశాలు వాయిదా పడ్డాయి. దశాబ్దాలకాలంలో ఇలా సమావేశాలు వాయిదాపడటం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని సోమవారం చైనా మీడియా వెల్లడించింది. చైనాలో కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటివరకు 2,500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 77 వేల మందికిపైగా ఈ వైరస్‌ బారిన పడ్డారు. దేశ అత్యున్నత చట్టసభ అయిన నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌(ఎన్పీసీ)లోని స్టాండింగ్‌ కమిటీ సోమవారం బీజింగ్‌లో సమావేశమైంది. కరోనా వైరస్‌ కారణంగా వార్షిక పార్లమెంట్‌ సమావేశాలను వాయిదా వేయాలనే ప్రతిపాదనను కమిటీ ఆమోదించినట్టు చైనా గ్లోబల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ టీవీ వెల్లడించింది. వాస్తవానికి 13వ ఎన్పీసీ మూడో వార్షిక సమావేశాలు బీజింగ్‌లో మార్చి ఐదున ప్రారంభించాలని అనుకున్నారు. 150 కొత్త మరణాలతో ఇప్పటివరకు కరోనా వైరస్‌తో మరణించినవారి సంఖ్య 2,592కు చేరిందని, ఈ వైరస్‌ కేసులు 77 వేలకుపైగా పెరిగాయని వైద్యాధికారులు సోమవారం ధ్రువీకరించారు. కాగా చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సంయుక్త వైద్య నిపుణుల బృందం హుబీ రాష్ట్రంలో పర్యటించింది.logo
>>>>>>