ఇండియా నుంచే కరోనా వైరస్ వచ్చి ఉండొచ్చు : చైనా

బీజింగ్: చైనా మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకుంది. కరోనా వైరస్‌కు ఇండియా కూడా కారణం కావచ్చని అక్కడి అధికార మీడియా నిరాధార ఆరోపణలు చేస్తోంది. వైరస్ మొదట చైనాలో కనిపించినంత మాత్రాన అది ఇక్కడి నుంచే మొదలైందని ఎలా ఆరోపిస్తారని విమర్శిస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆహార ఉత్పత్తుల నుంచే వుహాన్‌కు కరోనా వైరస్ వచ్చిందని వాదిస్తోంది. ఇందులో ఇండియా నుంచి వచ్చిన ఒక చేపల కన్సైన్మెంట్ కూడా ఉన్నదని, అందులోనూ కరోనా వైరస్ జాడలు కనిపించినట్లు చెబుతోంది. ఈ వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దర్యాప్తు మొదలుపెట్టనున్న సమయంలో చైనా ఇలాంటి ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. అసలు కరోనా వైరస్ వుహాన్‌లో కనిపించిందా లేక అక్కడే పుట్టిందా అన్న అంశంపై డబ్ల్యూహెచ్‌వో విచారణ చేపట్టనుంది. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ కూడా ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారు. చైనాలో కనిపించినంత మాత్రాన వైరస్ ఇక్కడే పుట్టిందని ఎలా చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు. వైరస్ ఎక్కడ పుట్టిందో తెలుసుకోవడం ఒక సంక్లిష్టమైన శాస్త్రీయ ప్రక్రియ అని అన్నారు. త్వరలోనే డబ్ల్యూహెచ్‌వో తన విచారణ మొదలుపెట్టనుంది. ఇందులో భాగంగా అమెరికా, జపాన్‌తోపాటు ఇతర దేశాలకు చెందిన పది మంది అంతర్జాతీయ నిపుణులు డబ్ల్యూహెచ్‌వోకు దర్యాప్తులో సహాయం చేయనున్నారు.
తాజావార్తలు
- రాధేశ్యామ్ యూనిట్‌కు ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
- పట్టు బిగిస్తున్న భారత్.. నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి దరఖాస్తుల స్వీకరణ
- మెట్రో వెంచర్.. ఆదాయంపై ఫోకస్
- రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
- ముదిరాజ్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
- బోగస్ గుర్తింపు కార్డులతో చిత్రపురి కాలనీలో ఫ్లాట్లు
- వివిధ కారణాలతో పలువురి ఆత్మహత్య
- సీసీ కెమెరాలు పట్టించాయి..
- సౌర విద్యుత్‌పై గ్రేటర్ వాసుల ఆసక్తి