చంద్రుడిపై జెండా పాతిన చైనా.. ఫోటోలు రిలీజ్‌

Dec 05, 2020 , 12:59:18

హైద‌రాబాద్‌: చంద్రుడిపై డ్రాగ‌న్ దేశం త‌న జాతీయ జెండాను ఎగుర‌వేసింది. దానికి సంబంధించిన ఫోటోల‌ను ఆ దేశం రిలీజ్ చేసింది.  చంద్రుడిపై జెండాను నాటిన రెండవ దేశంగా చైనా నిలిచింది.  ఛేంజ్ 5 ల్యాండ‌ర్‌కు ఉన్న కెమెరా ఈ ఫోటోను తీసింది. 50 ఏళ్ల క్రితం అమెరికా త‌న జాతీయ జెండాను చంద్రుడిపై నాటింది.  చంద్రుడి నేల‌పై ఉన్న మ‌ట్టిని తీసుకువ‌చ్చేందుకు చైనా తాజాగా ప్ర‌యోగం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.  చైనా పాతిన జెండా సుమారు 2 మీట‌ర్ల పొడుగు, 90 సెంటీమీట‌ర్ల వెడ‌ల్పు ఉంది.న‌వంబ‌ర్ 23వ తేదీన లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా ఛేంజ్‌5 మిష‌న్‌ను చైనా లాంచ్ చేసింది. అయితే చంద్రుడి ఉప‌రిత‌లం మీద నుంచి ఇప్ప‌టికే అమెరికా, ర‌ష్యా దేశాలు రాళ్లు తెచ్చాయి. ఇక ఇప్పుడు ఆ లిస్టులో మూడ‌వ దేశంగా చైనా చేరింది.  అమెరికా, ర‌ష్యా తీసుకువ‌చ్చిన రాళ్లు సుమారు 320 కోట్ల సంవ‌త్స‌రాల క్రితం నాటికి చెంది ఉంటాయ‌ని అంచ‌నా వేశారు.  మూన్ మీద‌కు మ‌నుషుల‌ను పంపాల‌నుకుంటున్న చైనా.. 2030 నాటికి మార్స్ గ్ర‌హం నుంచి కూడా మ‌ట్టిని తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ వేసింది. 1969లో చంద్రుడిపై అమెరికా జెండా నాటింది.  అపోలో 11 మిష‌న్‌లో వెళ్లిన వ్యోగాములు ఆ ప్ర‌క్రియ పూర్తి చేశారు.  ఆ త‌ర్వాత 1972 వ‌ర‌కు మ‌రో అయిదు జెండాల‌ను చంద్రుడిపై అమెరికా పాతింది. అయితే ఆ జెండాలు ఇంకా నిల‌బ‌డి ఉన్న‌ట్లు 2012లో తీసిన నాసా శాటిలైట్ చిత్ర‌లు వెల్ల‌డించాయి.


తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD