మంగళవారం 07 జూలై 2020
International - Jun 21, 2020 , 07:52:52

భార‌త్ మిత్ర‌దేశాల‌ను బుట్ట‌లో వేసేందుకు చైనా స్కెచ్!‌

భార‌త్ మిత్ర‌దేశాల‌ను బుట్ట‌లో వేసేందుకు చైనా స్కెచ్!‌

న్యూఢిల్లీ: భారత్‌కు అనుకూలంగా ఉండే మిత్ర దేశాల‌ను త‌న‌వైపు తిప్పుకునేందుకు చైనా ప‌క్కా ప్లాన్ చేస్తున్న‌ది. అందులో భాగంగానే భార‌త్‌కు చిర‌కాల‌ మిత్ర దేశమైన బంగ్లాదేశ్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న దాదాపు 5,161 ర‌కాల‌ ఉత్పత్తులపై 97 శాతం సుంకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్‌ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. లఢక్‌ ఘర్షణలు జరిగిన జూన్‌ 16 మరుసటి రోజే చైనా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.  

కాగా, భారత్‌తో సత్సంబంధాలు కలిగిన దేశాలను దూరం చేసి త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డానికే చైనా ఎత్తుగ‌డ‌లు వేస్తున్న‌ద‌ని అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌పై ప‌ట్టున్న నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవ‌ల నేపాల్ సైతం భారత్‌లోని మూడు భూభాగాలను తమవిగా పేర్కొంటూ కొత్త మ్యాప్‌ను రూపొందించింది. ఆ మ్యాప్‌కు నేపాల్ పార్లమెంట్ ఆమోద‌ముద్ర కూడా వేసింది. దీని వెనుక కూడా చైనా హస్తం ఉన్నట్లు నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.  


logo