సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Jul 24, 2020 , 10:23:44

చెంగ్డూలో అమెరికా కాన్సుల్ లైసెన్స్ ర‌ద్దు

చెంగ్డూలో అమెరికా కాన్సుల్ లైసెన్స్ ర‌ద్దు

బీజింగ్‌: హ‌్యూస్ట‌న్‌లోని చైనా కాన్సులేట్‌ను మూసివేయాల‌ని అమెరికా ఆదేశించిన‌ 72 గంట‌ల్లోనే డ్రాగ‌న్ దేశం ప్ర‌తిస్పందించింది. చెంగ్డూలోని యూఎస్ కాన్సులేట్ లైసెన్సును ర‌ద్దుచేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అమెరికా అస‌మంజ‌స‌మైన చ‌ర్య‌ల‌కు ఇది చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన‌, అవ‌స‌ర‌మైన ప్ర‌తిస్పంద‌న అని విదేశాంగ‌శాఖ శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. ఇరుదేశాల‌ సంబంధాల్లో ప్రస్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల‌కు అమెరికానే బాధ్య‌తవ‌హించాల‌ని పేర్కొంది. ‌

ప్ర‌పంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం నెల‌కొన్న‌ది. తాజాగా హ్యూస్ట‌న్‌లోని చైనా కాన్సులేట్‌ను 72 గంట‌ల్లో మూసివేయాల‌ని ట్రంప్ ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం ఆదేశించింది. అయితే అమెరికా తీసుకున్న నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని, లేన‌ట్ల‌యితే ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని బీజింగ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. 

చెంగ్డూలోని 1985లో యూఎస్ కాన్సులేట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 200 మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. అందులో 150 మంది స్థానికులు ఉన్నారు.


logo