శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 04, 2020 , 09:18:20

కోవిడ్ మృతుల‌కు నివాళి అర్పించిన చైనా

కోవిడ్ మృతుల‌కు నివాళి అర్పించిన చైనా

హైద‌రాబాద్‌: డ్రాగ‌న్ దేశం చైనా.. ఇవాళ కోవిడ్‌19 మృతుల‌కు నివాళి అర్పించింది.  మూడు నిమిషాల పాటు మౌనం పాటించింది. నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల చైనాలో సుమారు 3300 మంది మ‌ర‌ణించారు. ఈ నేప‌థ్యంలో శ‌నివారం సంస్మ‌ర‌ణ దినాన్ని పాటించారు.  ఉద‌యం 10 గంట‌ల‌కు దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు కోవిడ్ మృతుల‌కు నివాళి అర్పించారు.   కార్లు, రైళ్లు, నౌక‌లు.. హార‌న్ మోగించాయి.  దేశంతో పాటు చైనా ఎంబ‌సీలు ఉన్న అన్ని దేశాల్లోనూ డ్రాగ‌న్ జెండాను అవ‌న‌తం చేశారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో తొలి క‌రోనా కేసును వుహాన్ న‌గ‌రంలో గుర్తించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఆ వైర‌స్ మ‌హ‌మ్మారిగా మారి.. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఇప్ప‌టికే వైర‌స్ ప‌ది ల‌క్ష‌ల మందికి సంక్ర‌మించింది. 60 వేల మంది చ‌నిపోయారు.  చైనా దేశ‌వ్యాప్తంగా నివాళి అర్పించ‌డం ఇది నాలుగోసారి.  2008లో సిచువాన్ భూకంపం, 2010లో యుషు భూకంపం, 2010లోనే ఘాన్సూలో కొండ‌చ‌రియ‌లు విరిగిన ఘ‌ట‌న‌ల స‌మ‌యంలో దేశ ప్ర‌జ‌లంతా నివాళి అర్పించారు.logo