గురువారం 28 మే 2020
International - Apr 04, 2020 , 10:06:58

కోవిడ్‌పై పోరాటం.. 95 మంది పోలీసులు మృతి

కోవిడ్‌పై పోరాటం.. 95 మంది పోలీసులు మృతి


హైద‌రాబాద్: చైనాలో కోవిడ్‌19పై పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన వారికి ఇవాళ‌ ఆ దేశం నివాళి అర్పించింది.  అయితే ఆ పోరాటంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దేశం 95 మంది పోలీసుల ప్రాణాలు కూడా కోల్పోయింది.  ఈ విష‌యాన్ని ఆ దేశ ప‌బ్లిక్ సెక్యూర్టీ మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది. చ‌నిపోయివారిలో 60 మంది పోలీసు ఆఫీస‌ర్లు, 35 మంది స్పెష‌ల్ పోలీసులు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.  దేశంలో నోవల్ క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న స‌మ‌యంలో.. విధ‌నిర్వ‌హ‌ణ‌లో భాగంగా దేశ‌భ‌ద్ర‌త‌ను సంర‌క్షించే క్ర‌మంలో పోలీసులు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు చైనా వెల్ల‌డించింది.logo