శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Mar 24, 2020 , 14:00:10

చైనాలో లాక్‌డౌన్ ఎత్తివేత ?

చైనాలో లాక్‌డౌన్ ఎత్తివేత ?

క‌రోనా వైర‌స్ పుట్టినిల్లు చైనా క్ర‌మంగా కోలుకుంటుంది. గ‌త కొన్ని రోజులుగా చైనాలో ఒక్క క‌రోనా పాజిటివ్ కేసు కూడా న‌మోదు కాక‌పోవ‌డంతో ఊపిరిపిల్చుకుంది.  దీనికి తోడు క‌రోనా బాధితులు కూడా కోలుకుంటున్న‌ నేప‌థ్యంలోనే చైనాలో విధించిన లాక్‌డౌన్ ఎత్తివేసే యోచ‌న‌లో చైనా ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు స‌మాచారం. ఏప్రిల్ 8 నాటికి అక్క‌డ పూర్తిగా ఆంక్ష‌లు ఎత్తివేసేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే స్థానికంగా  ఒక్క క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదు కాకున్నా విదేశాల నుంచి వ‌చ్చేవారికి క‌రోనా పాజిటివ్ వ‌స్తున్న నేప‌థ్యంలో కాస్త  క‌ల‌వ‌ర‌పాటుకు గురౌవుతుంది.logo