గురువారం 28 మే 2020
International - May 12, 2020 , 15:11:25

రెండు శాటిలైట్లు ప్ర‌యోగించిన చైనా

రెండు శాటిలైట్లు ప్ర‌యోగించిన చైనా



హైద‌రాబాద్‌: చైనా ఇవాళ రెండు ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌యోగించింది.  ఇంట‌ర్నెట్ క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ కోసం ఆ శాటిలైట్ల‌ను నింగిలోకి పంపింది.  జిన్‌గున్‌-2కు చెందిన రెండు ఉప‌గ్ర‌హాల‌ను .. కువ‌జువా-1ఏ రాకెట్ ద్వారా ప్ర‌యోగించారు. జుక్వాన్ శాటిలైట్ సెంట‌ర్ నుంచి ఈ ప్ర‌యోగం సాగింది.  విజ‌య‌వంతంగా ఆ రెండు ఉప‌గ్ర‌హాలు క‌క్ష్య‌లోకి చేరిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. జిన్‌గున్ శాటిలైట్ కంపెనీ.. ఆ రెండు ఉప‌గ్ర‌హాల‌ను డెవ‌ల‌ప్ చేసింది. అంత‌రిక్ష ఆధారిత ఇంట‌ర్నెట్ సేవ‌ల‌పై ఆ శాటిలైట్లు ప్ర‌యోగాలు చేప‌డుతాయి. ఐఓటీ అప్లికేష‌న్స్‌పై పైల‌ట్ ప‌రిశోధ‌న చేప‌ట్ట‌నున్నాయి. లో ఆర్బిట్ స్మాల్ శాటిలైట్ల‌ను నింగిలోకి పంపేందుకు కేజెడ్‌-1ఏ రాకెట్‌ను వాడుతారు. కేజెడ్ సిరీస్‌లో ఇది తొమ్మిద‌వ రాకెట్ కావ‌డం విశేషం. 

 



logo