ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Jul 25, 2020 , 14:23:14

అంతరిక్షంలోకి చైనా కొత్త ఉపగ్రహం

అంతరిక్షంలోకి చైనా కొత్త ఉపగ్రహం

తైయువాన్‌:  ఉత్తర ప్రావిన్స్ షాంక్సిలోని తైయువాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి చైనా శనివారం తన కొత్త హై-రిజల్యూషన్ మ్యాపింగ్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. జియువాన్ III 03 ఉపగ్రహాన్ని తన శక్తివంతమైన రాకెట్‌ లాంగ్‌మార్చ్‌-4 బి ద్వారా  ఉదయం 11:13 గంటలకు (బీజింగ్‌ టైమ్‌) ప్రయోగించినట్లు చైనా అంతరిక్ష కేంద్రం వెల్లడించింది. లాంగ్‌మార్చ్‌ రాకెట్‌ సిరీస్‌లో ఇది 341వ ప్రయోగం. లాంగ్‌మార్చ్‌ అనేది  చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న రాకెట్ల ప్రయోగవ్యవస్థ శ్రేణి.

ఈ రాకెట్‌ ద్వారా డార్క్ మ్యాటర్ డిటెక్షన్, కమర్షియల్ డేటా సేకరణ కోసం మరో రెండు ఉపగ్రహాలను కూడా పంపించారు. వీటిని షాంఘై ఏఎస్‌ఈఎస్‌ స్పేస్ ఫ్లైట్ టెక్నాలజీ కంపెనీ  లిమిటెడ్ అభివృద్ధి చేసింది. మూడు ఉపగ్రహాలు ముందుగానే నిర్దేశించిన కక్ష్యల్లోకి ప్రవేశించాయని తైయువాన్ కేంద్రం వర్గాలు తెలిపాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo