గురువారం 02 జూలై 2020
International - Jun 17, 2020 , 18:29:28

ఎర్త్‌ అబ్జర్వేషన్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా

ఎర్త్‌ అబ్జర్వేషన్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా

బీజింగ్‌:  భూ పర్యవేక్షణ కోసం కొత్త ఉపగ్రహాన్ని చైనా బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. వాయువ్య చైనాలోని జియుక్వాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ మధ్యాహ్నం 3:19గంటలకు ఆప్టికల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌  గావోఫెన్‌-9 03ని లాంగ్‌ మార్చ్‌-2డీ  రాకెట్‌ ద్వారా  భూ కేంద్ర కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ రాకెట్‌ ద్వారా మరో రెండు ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపింది. లాంగ్‌ మార్చ్‌  రాకెట్‌ సిరీస్‌లో ఇది 335వ ప్రయోగం. 

ప్రధానంగా   బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం ఈ ఉపగ్రహాన్ని చైనా ప్రయోగించింది.  నింగి నుంచి  అత్యంత స్పష్టంగా నాణ్యమైన ఫొటోలు తీస్తుంది. భూ సర్వే, సిటీ ప్లానింగ్‌, భూమి హక్కు నిర్ధారణ, రోడ్‌ నెట్‌వర్క్‌ రూపకల్పన, పంట దిగుబడి అంచనా, విపత్తు సహాయక కార్యక్రమాలకు ఈ ఉపగ్రహ సేవలను ఉపయోగించనున్నారు. 


logo