శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Jul 14, 2020 , 18:41:56

చనిపోయిన సైనికుల అంత్యక్రియలు వద్దన్న చైనా

చనిపోయిన సైనికుల అంత్యక్రియలు వద్దన్న చైనా

న్యూఢిల్లీ / బీజింగ్ : తూర్పు లడఖ్ లోని గల్వాన్ లోయలో చనిపోయిన తమ సైనికులను గుర్తించడానికి చైనా సిద్ధంగా లేదని తెలుస్తున్నది. సైనికుల శవాలను పాతిపెట్టవద్దని, అంత్యక్రియల కార్యక్రమాలు చేయవద్దని వారి కుటుంబాలకు చైనా ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నది. ఈ విషయాలను అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడిస్తున్నది. చైనా ఒక పెద్ద తప్పును దాచడానికి వీలుగా ఇలా చేస్తున్నదని ఆ నివేదికలో పేర్కొన్నది.

గత నెల 15 వ తేదీన గల్వాన్ లోయలో చైనా-భారత సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. ఇందులో రెండు దేశాల సైనికులు మరణించారు. తమకు చెందిన 20 మంది సైనికులు అమరవీరులయ్యారని భారత్ ఏమాత్రం సంకోచించకుండా అంగీకరించింది. అదే సమయంలో.. అమరవీరులకు గౌరవప్రదమైన తుది వీడ్కోలు పలికింది. అయితే, చైనా మాత్రం తమ సైనికుల మరణాల వార్తలను ఖండిస్తూనే వస్తున్నది.

తూర్పు లడఖ్‌లో ప్రస్తుత పరిస్థితిని మార్చడానికి ఏకపక్షంగా ప్రయత్నిస్తూ చైనా హింసాత్మక ఘర్షణలను ఎదుర్కొన్నది. చైనా ఉన్నత స్థాయి ఒప్పందాన్ని అనుసరించినప్పుడే ఘర్షణలను నివారించవచ్చని భారత్ తెలిపింది. ఈ ఘర్షణలో 35 మంది చైనా సైనికులు మరణించారని అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం అభిప్రాయపడింది.

ఈ ఘర్షణలో మరణించిన సైనికులకు సంప్రదాయం ప్రకారం ఖననం చేయవద్దని, సైనికుల అవశేషాలకు అంత్యక్రియలు జరుపవద్దని చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పిందని ఈ కేసుకు దగ్గరగా చూస్తున్న కొన్ని వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ కారణంగా ఎవరి అంత్యక్రియలు అయినా ఒకే ప్రదేశంలో జరగాలని చైనా ప్రభుత్వం పేర్కొంటున్నది. ఈ ఘర్షణలో మరణించిన సైనికుల జ్ఞాపకాలను తొలగించేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.

మరణించి సైనికుల కుటుంబాల్లో ఆగ్రహం

చైనాకు చెందిన బ్రెట్‌బార్ట్ న్యూస్ ప్రకారం.. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయంతో మరణించిన సైనికుల కుటుంబంలో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మరణించిన సైనికుల కుటుంబాలు వీబో, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


logo