ఆదివారం 25 అక్టోబర్ 2020
International - Oct 18, 2020 , 15:27:53

తైవాన్‌పై సైనిక దాడికి సన్న‌ద్ధ‌మ‌వుతున్న చైనా!

తైవాన్‌పై సైనిక దాడికి సన్న‌ద్ధ‌మ‌వుతున్న చైనా!

బీజింగ్‌: తైవాన్‌పై సైనిక దాడికి పాల్ప‌డేందుకు చైనా సిద్ధమవుతున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఈ మేరకు ఇప్పటికే సరిహద్దుల్లోకి భారీగా బలగాలను, ఆయుధాల‌ను త‌ర‌లించిన‌ట్లు స‌మాచారం. డీఎఫ్‌-11, డీఎఫ్‌-15 క్షిపణుల స్థానంలో అత్యాధునిక హైపర్‌సోనిక్‌ డీఎఫ్‌-17 క్షిపణుల‌ను మోహరించినట్లు రక్షణ రంగ నిపుణులు తెలిపారు. అలాగే ఫుజియాన్‌, గ్వాన్‌డాంగ్‌లోని రాకెట్‌ ఫోర్స్‌, మెరైన్‌ కార్ప్స్  స్థావరాల‌ను సైతం విస్తరించినట్లు కెనడా కేంద్రంగా పనిచేస్తున్న కన్వా డిఫెన్స్‌ రివ్యూ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా తెలుస్తున్న‌ది. ఇటీవల తైవాన్‌ సరిహద్దుల్లో చైనా సైనిక విన్యాసాల‌ను సైతం అధికం చేసింది. 

కాగా, ఇటీవల డ్రాగన్ కంట్రీకి చెందిన 40 యుద్ధ విమానాలు తైవాన్‌ సరిహద్దు రేఖను దాటి వెళ్లాయి. అంతేగాక‌ ఇటీవల గ్వాన్‌డాంగ్‌లోని సైనిక స్థావరాల‌ను సందర్శించిన అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌.. సైనికులంతా తమ దృష్టిని యుద్ధ సన్నద్ధతపైనే ఉంచాలని పిలుపునిచ్చారు. సైనికులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బలగాల మోహరింపులు, సైనిక స్థావరాల విస్తరణ, జిన్‌పింగ్‌ ప్రకటనని బట్టి చూస్తే తైవాన్‌పై చైనా దాడికి సిద్ధమ‌వుతున్న‌దే విష‌యం అర్థ‌మ‌వుతున్న‌ది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo