శనివారం 30 మే 2020
International - Apr 21, 2020 , 08:33:24

వైర‌స్‌కు తాము బాధితుల‌మే.. అమెరికా విచార‌ణ‌కు చైనా నో

వైర‌స్‌కు తాము బాధితుల‌మే.. అమెరికా విచార‌ణ‌కు చైనా నో

బీజింగ్‌: కరోనా వైరస్ వ్యాప్తిపై విచారణకు చైనా నో చెప్పింది. తాము కూడా కరోనా బాధితులమేగానీ, నేరస్తులం కాదని ఆ దేశం పేర్కొంది. కరోనా వైరస్‌ చైనాలోని వూహాన్‌లో ఒక పరిశోధనశాల నుంచి తప్పించుకుందా.. అనే కోణంలో అమెరికా విచారణ ప్రారంభించింది. ఈ నేప‌థ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌ను చైనా ఖండించింది. ట్రంప్‌ వ్యాఖ్యలపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్.. ఈ వైరస్ మానవాళికంతటికీ ఉమ్మడి శత్రువని అన్నారు. మేము కూడా దీని బారిన పడిన బాధితులమేనన్నారు. ఇతర దేశాల మాదిరే  మేమూ ఈ వైరస్ కారణంగా బాధ పడుతున్నామని ఆయన చెప్పారు.ఈ వైరస్‌ను తయారు చేసిన వాళ్లలో మేము లేమని చెప్పుకొచ్చారు. కరోనా నియంత్ర‌ణ‌కు చైనా పారదర్శకంగా ఉందన్న‌ ఆయన... వైరస్‌ కట్టడికి సంబంధించి చైనా అంతర్జాతీయ సమాజానికి విలువైన సమాచారాన్ని ఇచ్చిందని చెప్పారు


logo