గురువారం 09 జూలై 2020
International - Jun 30, 2020 , 12:46:24

చైనా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతోంది : అమెరికా సెనేటర్ మార్కో రూబియో

చైనా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతోంది : అమెరికా సెనేటర్ మార్కో రూబియో

వాషింగ్‌టన్‌ : భారత్‌, చైనా మధ్య కొద్దిరోజులుగా జరుగుతున్న వివాదంపై ప్రపంచం మొత్తం దృష్టి సారిస్తోంది. రెండు అణు సంపన్న దేశాల మధ్య వివాదం ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపుతోంది. చాలామంది అమెరికా సెనేటర్లు ఉద్దేశపూర్వకంగా భారత్‌పై దూకుడు వైఖరిని ప్రదర్శిస్తున్నందుకు గాను చైనాపై విరుచుకుపడుతున్నారు. 

తాజాగా అమెరికా సెనేటర్‌ మార్కో రుబియో అమెరికా రాయబారి తరంజిగ్‌ సింగ్‌తో మాట్లాడుతూ,  చైనాతో భారతదేశానికి నిర్లక్ష్యపు వాతావరణం ఏర్పడిందని, ఈ విషయంలో తాము భారత్‌తో కలిసి ఉన్నామని స్పష్టం చేశారు. చైనాకు భారత్‌ తల వంచదని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.  

అదే విధంగా మరో సెనేట్‌ మెజారిటీ లీడర్‌ మిచ్‌ మెకోనెల్‌ మాట్లాడుతూ చైనా కావాలనే భారత్‌తో  గొడవకు దిగుతుందన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఈ వాతావరణాన్ని సృష్టిస్తుందని మండిపడ్డారు. చైనా భారత్‌కు చెందిన 20 మంది సైనికులను చంపేసిందన్నారు. 

భారత్‌, చైనా మధ్య కొనసాగుతున్న వివాదానికి ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని, ఇరు దేశాలు చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేసిన విషయం తెలిసిందే. 

జూన్ 15న గాల్వన్ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగి ఇండియాకు చెందిన 20 మంది సైనికులు అమరులైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల్లో ఉద్రిక్తత నెలకొంది. logo