బుధవారం 03 జూన్ 2020
International - Apr 28, 2020 , 13:00:47

అప్పుడు సార్స్ రోగుల‌కు.. ఇప్పుడు క‌రోనా బాధితుల‌కు

అప్పుడు సార్స్ రోగుల‌కు.. ఇప్పుడు క‌రోనా బాధితుల‌కు

బీజింగ్‌: ఇన్నాళ్లూ క‌రోనా బాధితులకు చికిత్స అందించిన ఓ ప్రత్యేక ఆస్పత్రిని చైనా మంగళవారం మూసివేసింది. కరోనా రోగులందరూ కోలుకుని డిశ్చార్జ్‌ కావడంతో చైనా స‌ర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. జియోటాంగ్షన్‌లో ఉన్న ఈ ఆస్పత్రిని సార్స్‌ పేషంట్ల కోసం 2003లో నిర్మించారు. సార్స్ వ్యాధి విజృంభించిన నేప‌థ్యంలో అప్ప‌ట్లో కేవ‌లం వారం రోజుల వ్య‌వ‌ధిలోనే ఈ ఆస్ప‌త్రి నిర్మించ‌డం విశేషం. 

అయితే, సార్స్ వ్యాధి త‌గ్గుముఖం ప‌ట్టిన త‌ర్వాత ఈ ఆస్ప‌త్రిని మూసివేశారు. అయితే కొత్త‌గా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించ‌డంతో ఈ ఆస్ప‌త్రి సేవ‌లు మ‌రోసారి అవ‌స‌ర‌మ‌య్యాయి. దీంతో 2020, మార్చి 16న ఈ ఆస్ప‌త్రిని తిరిగి తెరిచి క‌రోనా బాధితుల‌కు సేవ‌లందించారు. ఇప్పుడు క‌రోనా మ‌హ‌మ్మారి కూడా శాంతించ‌డంతో మళ్లీ ఆ ఆస్ప‌త్రిని మూసివేశారు. కాగా, దాదాపు 83 వేల పాజిటివ్ కేసులు న‌మోదైన చైనాలో 4,633 మంది మ‌ర‌ణించ‌గా, కేవ‌లం 648 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మిగ‌తా వారంతా పూర్తిగా కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.   

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo