సోమవారం 30 మార్చి 2020
International - Mar 27, 2020 , 12:14:11

క‌రోనా గురించి చైనా అధ్య‌క్షుడితో మాట్లాడిన ట్రంప్‌

క‌రోనా గురించి చైనా అధ్య‌క్షుడితో మాట్లాడిన ట్రంప్‌

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. క‌రోనా వైర‌స్ గురించి చైనా అధ్య‌క్ష‌డు జీ జిన్‌పింగ్‌తో మాట్లాడారు.  ఈ విష‌యాన్ని ట్రంప్ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు.  జిన్‌పింగ్‌తో వైర‌స్ గురించి మంచి చ‌ర్చ జ‌రిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  వైర‌స్ నియంత్ర‌ణ కోసం రెండు దేశాలు క‌లిసి క‌ట్టుగా పోరాడుతున్న‌ట్లు చెప్పారు.  వైర‌స్ వ‌ల్ల చైనా అత్యంత క‌ష్ట స‌మ‌యాల‌ను గ‌డిపింద‌న్నారు.  వైర‌స్ గురించి ఆ దేశానికి పూర్తి అవ‌గాహ‌న వ‌చ్చింద‌ని ట్రంప్ త‌న ట్వీట్‌లో తెలిపారు.  అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య చైనాను దాటేసింది.  దీంతో జాగ్ర‌త్త‌ప‌డ్డ ట్రంప్‌.. చైనా అధ్య‌క్షుడితో మాట్లాడారు.  భూగోళాన్ని ద‌హించివేస్తున్న క‌రోనా గురించి జిన్‌పింగ్‌తో మాట్లాడిన‌ట్లు ఆయ‌న ఈ సంద‌ర్భంగా తెలిపారు. వైర‌స్ నియంత్ర‌ణ కోసం క‌లిపి ప‌నిచేస్తున్నామ‌ని, డ్రాగ‌న్ దేశం ప‌ట్ల మ‌ర్యాద ఉంద‌న్నారు. 


logo